చిన్న పిల్లలకు దొంగతనం ట్రైనింగ్.. చోరీ చేపిస్తున్న కిలాడీ లేడీ

చిన్న పిల్లలకు దొంగతనం ట్రైనింగ్.. చోరీ చేపిస్తున్న కిలాడీ లేడీ

హైదరాబాద్ ఉప్పల్ లో  కిలాడీ  లేడీ దొంగలు  రెచ్చిపోయారు. చిన్న పిల్లలకు దొంగతనం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చి.. చోరీలను చేపిస్తున్నారు కిలాడీ లేడీ దొంగలు. ఉప్పల్ ఏషియన్ సినిమా హాల్ దగ్గర  ఓ సైకిల్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. షాప్ లో వర్కర్  ఉన్నాడని యజమాని బయటకు వెళ్లి వచ్చేలోపే క్యాష్ కౌంటర్ లో డబ్బులు మాయం చేశారు. ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కలిసి చోరీకి పాల్పడ్డారు.  

ఒక మహిళ వర్కర్ తో మట్లాడుతూ ఉండగా చిన్నారి షాప్ లోనికి వెళ్లి  క్యాష్ కౌంటర్ లోని నగదు దొంగతనం  చేసింది. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  సైకిల్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు ఇవ్కడంతో కిలాడీ లేడీ ముఠా కోసం గాలిస్తున్నారు పోలీసులు.