
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని అన్నారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేశానని.. ఈనెల28న YSRCP లో చేరనున్నట్లు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ ను కలిశారు. బీసీ గర్జనలో జగన్ ఇచ్చిన హామీలు నచ్చాయని తెలిపారు. ఆంధ్రులకు న్యాయం జరగాలంటే అది జగన్ తోనే సాధ్యమని అన్నారు కృపారాణి.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని కిల్లీ కృపారాణి అన్నారు. బీసీలను, కుల వృత్తుల వారిని వాడుకుని చంద్రబాబు వదిలేశారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో బాబుకు ఓటమి తప్పదని తెలిపారు.రానున్న ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు చంద్రబాబు మాటలు విశ్వసించరని అన్నారు. తాను YSRCP లోకి టికెట్ ఆశించి వెళ్లడంలేదని కృపారాణి చెప్పారు.