పాల్వంచ, వెలుగు: 3 రో జులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 407 అడుగులు కాగా, గురువారం రాత్రి వరకు 405.60 అడుగులకు చేరింది.
ప్రాజెక్టులోకి 1400 క్యూ సెక్కుల నీరు చేరుతున్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి నీటి ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఏ క్షణమైనా కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతామని తెలిపారు.
