హైదరాబాద్, వెలుగు: తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ సెక్రటరీగా కిరణ్ చారి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో అసోసియేషన్ ఏజీఎం, ఎన్నికలు నిర్వహించారు. ప్రెసిడెంట్ గా వి. నవీన్ యాదవ్, సెక్రటరీగా కిరణ్, ట్రెజరర్‌గా వెంకట్ కోము ఏకగ్రీవం అయ్యారు. కొత్త కార్యవర్గం త్రోబాల్ వార్షిక క్యాలెండర్ ను ప్రతిపాదించడంతో పాటు హైదరాబాద్‌లో జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ నిర్వహణ ప్లాన్స్‌పై చర్చించింది.
