Sreeleela: కెమిస్ట్రీ అదిరింది.. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకుతో శ్రీలీల రొమాన్స్!

Sreeleela: కెమిస్ట్రీ అదిరింది.. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకుతో శ్రీలీల రొమాన్స్!

కర్నాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న  చిత్రం ‘జూనియర్’.శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్ర బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రజినీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. జెనీలియా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ రవిచంద్రన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూన్ 18న పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. సోమవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘లెట్స్ లివ్ దిస్ మూమెంట్’అంటూ సాగిన పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, శ్రీమణి క్యాచీ లిరిక్స్ అందించాడు. జస్ప్రీత్ జాజ్ పాడాడు. విజయ్ పొలాకి కొరియోగ్రఫీలో కిరీటి, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో కిరీటి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ప్రతి మూమెంట్‌‌‌‌ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు’అని చెప్పాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇదని నటుడు రవిచంద్రన్ అన్నారు.

డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ‘ఇందులో ప్రతి సాంగు చాలా స్పెషల్.  బెస్ట్ టీంతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.  ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా స్పెషల్‌‌‌‌గా ఉండబోతుంది’ అని చెప్పాడు. వెరీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ స్టోరీ అని, ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా ఉందని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు. నిర్మాత సాయి కొర్రపాటి, సినిమాటోగ్రాఫర్ సెంథిక్ కుమార్,  కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి పాల్గొన్నారు.