అక్టోబర్ 9 నుంచి కిసాన్ మేళా : సుగుణాకర్ రావు

అక్టోబర్ 9 నుంచి కిసాన్ మేళా : సుగుణాకర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు : పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అక్టోబర్​ 9 నుంచి 11 వరకు కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నామని మేళా కన్వీనర్ సుగుణాకర్ రావు చెప్పారు. బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి, అధిక పంట పండే విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు పరికరాల గురించి ఈ మేళాలో అవగాహన కల్పిస్తామన్నారు.

దాదాపు లక్ష మంది రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కన్నబోయిన ఓదేలు, గడ్డం నాగరాజు, బేతి మహేందర్ రెడ్డి, ఆనంద్, బ్రహ్మం, మొలుగూరి కిశోర్, కామరపు నరహరి, జితేందర్, శ్రీనివాస్, ప్రదీప్, భగవాన్, తిరుపతి, రమేశ్, శ్రీరాములు, మోహన్, సంపత్ పాల్గొన్నారు.