శర్వానంద్ కు ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఎందుకొచ్చింది?

శర్వానంద్ కు ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఎందుకొచ్చింది?

శర్వానంద్, రష్మిక జంటగా కిశోర్ తిరుమల రూపొందిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఖుష్బూ, రాధికా శరత్‌‌‌‌‌‌‌‌కుమార్, ఊర్వశి, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సత్య కృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగును పూర్తి చేసిన టీమ్ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టింది. నిన్న ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ‘హే లక్ష్మమ్మో, పద్మమ్మో, శాంతమ్మో, శారదమ్మో, గౌరమ్మో, కృష్ణమ్మో.. నా బాధే వినవమ్మో’ అంటూ హుషారుగా పాడాడు దేవిశ్రీ ప్రసాద్. తన ట్యూన్‌‌‌‌‌‌‌‌కి ‘ఈ గోలే ఏందమ్మో, ఈగోలే చాలమ్మో, ఓలమ్మో ప్లీజమ్మో.. నా బతుకే బుగ్గయ్యేనమ్మో’ అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్‌‌‌‌‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌గా కుదిరాయి. ‘ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటది అంటారు. కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి ఎందరు ఆడాళ్లు... ఆడాళ్లు మీకు జోహార్లు’ అంటూ తనకు  పెళ్లి కాకపోవడానికి  కారణమైన ఆడవాళ్లందరిపై ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ని వెళ్లగక్కుతున్నాడు శర్వా. ఆ ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే ఈ నెల 25న మూవీ చూడాల్సిందే.