కిచెన్ తెలంగాణ: ఘుమఘుమలాడే గరం ఛాయ్.. పుదీనా టీ ఇలా చేస్కోండి.. అదిరిపోతుంది !

కిచెన్ తెలంగాణ: ఘుమఘుమలాడే గరం ఛాయ్.. పుదీనా టీ ఇలా చేస్కోండి.. అదిరిపోతుంది !

హెర్బల్ టీ కావాల్సినవి:

  • నీళ్లు ‌‌‌‌‌‌‌‌‌‌- నాలుగు కప్పులు
  • అల్లం - ఒక ముక్క
  • ఎండుద్రాక్షలు - పది
  • బిర్యానీ ఆకు, దాల్చినచెక్క - ఒక్కోటి
  • లవంగాలు - ఐదు 
  • మిరియాలు - ఎనిమిది
  • యాలకులు - నాలుగు
  • పసుపు - అర టీస్పూన్
  • తులసి ఆకులు - మూడు
  • బెల్లం - ఒక టేబుల్ స్పూన్
  • నిమ్మరసం - పావు టీస్పూన్

తయారీ: గిన్నెలో నీళ్లు పోసి కాగబెట్టాలి. అందులో దంచిన మిరియాలు, అల్లం, ఎండుద్రాక్షలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి మరిగించాలి. ఆపై పసుపు, తులసి ఆకులు, బెల్లం కూడా వేసి కలపాలి. చివరిగా ఆ టీని వడకట్టి కప్​లో పోసి నిమ్మరసం వేసుకుని తాగితే టేస్ట్​ అదిరిపోతుంది. 

తులసి– రోజ్​కావాల్సినవి:

  • తులసి ఆకులు - ఇరవై 
  • గులాబీ రేకులు - కొన్ని 
  • అల్లం - చిన్న ముక్క
  • యాలకులు - రెండు
  • టీ పొడి - రెండు టీస్పూన్లు
  • చక్కెర - సరిపడా
  • పాలు - రెండు కప్పులు
  • నీళ్లు - ఒక కప్పు

తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో టీ పొడి, తులసి ఆకులు, దంచిన అల్లం, యాలకులు, గులాబీ రేకులు వేసి మరగనివ్వాలి. తర్వాత అందులో పాలు పోసి మరికాసేపు మరిగించాలి. ఆపై చక్కెర కూడా వేసి కలపాలి. చివరిగా ఛాయ్​ వడకట్టాలి. 

పుదీనా టీకి కావాల్సినవి:

  • వాము - ఒక టీ స్పూన్
  • నీళ్లు - ఒక గ్లాసు
  • పుదీనా - ఒక కప్పు
  • బెల్లం -సరిపడా

తయారీ: ఒక గిన్నెలో వాము వేసి వేగించాలి. తర్వాత అందులోనే నీళ్లు పోసి, పుదీనా వేసి మూతపెట్టి మరిగించాలి. ఆ తర్వాత మూత తీసి, బెల్లం వేసి మరికాసేపు మరిగించాలి. ఆపై వడకట్టి కప్పులో పోసుకుని తాగడమే.