KKR vs RCB: వివాదాస్పద రీతిలో కోహ్లీ ఔట్.. అంపైర్లతో వాగ్వాదం

KKR vs RCB: వివాదాస్పద రీతిలో కోహ్లీ ఔట్.. అంపైర్లతో వాగ్వాదం

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(18) వివాదాస్పద రీతిలో ఔట్ అయ్యాడు. హర్షిత్‌ రాణా వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి అతనికే క్యాచ్‌ ఇచ్చాడు. అయితే.., ఆ బంతి ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడంతో హైడ్రామా చోటు చేసుకుంది. నో- బాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరిగా నిర్ణయిస్తూ.. కోహ్లీది ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై  విరాట్, డుప్లెసిస్ మరోసారి ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించిప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. వారు ఔట్ అని తేల్చేశారు. దీంతో కోహ్లీ అసహనంతో పెవిలియన్‌కు వెళ్లాడు.

అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(50) హాఫ్ సెంచరీ చేయగా.. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌(48), రింకూ సింగ్‌ (24), ఆండ్రీ రస్సెల్‌ (27 నాటౌట్), రమణ్‌దీప్‌ సింగ్‌ (24 నాటౌట్) పరుగులతో రాణించారు.