క్లాసీ రాహుల్ కిరాక్ రికార్డు.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ప్లేయర్గా.. 

క్లాసీ రాహుల్  కిరాక్ రికార్డు.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ప్లేయర్గా.. 

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో కొత్త రికార్డు ను నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 4వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 105 ఇన్నింగ్స్ లు ఆడిన రాహుల్ 4వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. 

105 ఇన్నింగ్స్ ల్లో 4 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాహుల్ కన్నా ముందు వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన క్రిస్ గేల్ రికార్డును కేఎల్ రాహుల్ అదిగమించాడు. క్రిస్ గేల్ 112 ఇన్నింగ్స్ ల్లో ఈ ఫీట్ ను అందుకున్నాడు. తర్వాత స్థానాల్లో వార్నర్ (114 ఇన్నింగ్స్ లు), విరాట్ కోహ్లీ (128 ఇన్నింగ్స్ లు), డివిలియర్స్ (131 ఇన్నింగ్స్ లు) ఉన్నారు.