ఇండ్ల అమ్మకాలు అంతంతే.. రెండో క్వార్టర్ లో 1శాతం పెరుగుదల

ఇండ్ల అమ్మకాలు అంతంతే.. రెండో క్వార్టర్ లో 1శాతం పెరుగుదల

వెల్లడించిన నైట్​ఫ్రాంక్​ న్యూఢిల్లీ: మనదేశంలోని ఎనిమిది ప్రధాన రెసిడెన్షియల్​మార్కెట్లలో జూలై–-సెప్టెంబర్​ క్వార్టర్​లో అమ్మకాలు ఒక శాతం మాత్రమే పెరిగాయి.  డిమాండ్​ మందగించినట్లు ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ, రెసిడెన్షియల్​ ప్రాపర్టీలకు డిమాండ్ మున్ముందు పెరుగుతుందని రియల్టీ కన్సల్టెన్సీ నైట్​ ఫ్రాంక్​ మంగళవారం (అక్టోబర్ 07) తెలిపింది.  

రిపోర్టు ప్రకారం.. ప్రస్తుత క్యాలెండర్​ సంవత్సరం మూడో క్వార్టర్​లో ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1 శాతం పెరిగి 87,603 యూనిట్లకు చేరాయి.  వడ్డీ రేట్లు తగ్గడం,  ఆర్థిక వృద్ధి,  పన్ను రాయితీలు అమ్మకాల ఊపును కొనసాగించాయి.

   ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఎనిమిది ప్రధాన నగరాల్లోని అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గి 2,57,804 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ ఎనిమిది నగరాల్లో ఢిల్లీ-–ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​ (ఎంఎంఆర్​), పుణే, చెన్నై, హైదరాబాద్​, బెంగళూరు, కోల్​కతా, అహ్మదాబాద్​ ఉన్నాయి.