Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో SIP చేస్తున్నారా.. అయితే 7-5-3-1 రూల్ మీకు తెలుసా?

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో SIP చేస్తున్నారా.. అయితే 7-5-3-1 రూల్ మీకు తెలుసా?

SIP Investment: గడచిన మూడేళ్లుగా గోల్డ్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దీనికి ఒక కారణం మార్కెట్లలో కొన్ని నెలల వరకు కొనసాగిన బుల్ ర్యాలీతో పాటు చిన్న పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ పెరగటమే. తక్కువ నెలవారీ మెుత్తాలతో కూడా ఎస్ఐపీని స్టార్ట్ చేసేందుకు ఏఎంసీలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావటం కూడా మరో కారణంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఇన్వెస్టర్లు 7-5-3-1 రూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ముందుగా 7 విషయానికి వస్తే ఇది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో ఎస్ఐపీ పెట్టుబడుల విషయంలో ముందుకు సాగాలని సూచిస్తుంది. కనీసం ఏడేళ్ల పాటు పెట్టుబడి సగటున మంచి రాబడిని అందించినట్లు గత చరిత్ర కూడా చెబుతోంది. ఎక్కువ కాలానికి పెట్టుబడులను కొనసాగించటం పెట్టుబడిదారులకు నెగటివ్ రిటర్న్ రాకుండా కాపాడుతుంది.

ఇదే క్రమంలో 5 దేనిని సూచిస్తుందంటే.. ఇది పెట్టుబడిదారులు తమ పెట్టుబడి పోర్ట్ ఫోలియోను డైవర్సిఫై చేయాలని చెబుతోంది. ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియోలో లార్జ్ క్యాప్ ఫండ్స్, వాల్యూ స్టాక్స్ ఫండ్స్, హై గ్రోత్ ఫండ్స్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ తమ పోర్ట్ ఫోలియోలో కలిగి ఉండటం మంచి రాబడులను అందిస్తుంది. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు గ్లోబల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశీయ ఆర్థిక మందగమనం సమయంలో కూడా రాబడులను పొందేందుకు అవకాశాలను కలిగిస్తుంది.

Also Read:-శనివారం బ్రేక్ తీసుకున్న గోల్డ్.. హైదరాబాదులో బంగారం, వెండి నేటి రేట్లివే..

అలాగే 3 సంఖ్య పెట్టుబడిలో ఉండే మూడు రాబడి దశలను సూచిస్తుంది. చాలా మంది సహజంగా 10 నుంచి 12 శాతం మధ్య రాబడిని ఆశిస్తుంటారు. అయితే ఇక్కడ 7 నుంచి 10 శాతం మధ్య రాబడులను అందుకుంటుంటారు. ఇది నిరాశాజనకమైన ఫేజ్. ఇదే క్రమంలో కొన్ని సార్లు 0 నుంచి 7 శాతం మధ్య పొందే రాబడిని ఇరిటేటింగ్ ఫేజ్ అని అంటారు. అయితే మార్కెట్లలో ఒడిదొడుకులు సహజమైనవి కాబట్టి.. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో చేసే ఎస్ఐపీ పెట్టుబడులు తర్వాతి కాలంలో మంచి రాబడులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కొనసాగించటం ముఖ్యం. అయితే మార్కెట్లలో కొన్నిసార్లు కరెక్షన్ లేదా అంతర్జాతీయ దేశీయ పరిస్థితులతో కుప్పకూలటం వంటి వాటి వల్ల నెగటివ్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో కొందరు తక్కువ ధరల వద్ద పెట్టుబడి పెట్టి మార్కెట్లు తిరిగి పుంజుకోవటం నుంచి కూడా లాభాలను అందుకుంటుంటారు. ఈ సమయంలో ఫండ్ యూనిట్స్ అమ్మేయకుండా పెట్టుబడిని కొనసాగించటం ముఖ్యం.

ఇక చివరిగా 1 ఇన్వెస్టర్లకు అత్యంత ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది. అదేంటంటే.. ఏటా పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీ మెుత్తాల పెంపు. ఇది సదరు వ్యక్తుల ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సమయాన్ని తగ్గిస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ కార్పస్ క్రియేట్ చేసేందుకు పెట్టుబడి మెుత్తాన్ని ప్రతి ఏటా కొంత పెంచటం కీలకం. ఇలా 7-5-3-1 రూల్ పాటిస్తూ ఈక్విటీ పెట్టుబడులు చేసే ఇన్వెస్టర్లు మంచి రాబడులను అందుకోవటం చాలా ఈజీ.