టెన్షన్ లేకుండా సేఫ్‌గా రూ.90 లక్షలు కావాలా..? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్‌ బెస్ట్..

టెన్షన్ లేకుండా సేఫ్‌గా రూ.90 లక్షలు కావాలా..? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్‌ బెస్ట్..

భారతదేశంలో అనేక దశాబ్ధాలు గ్రామీణ ప్రజల నుంచి పట్టణాల్లోని వారి వరకు అందరికీ పోస్టాఫీసులు అనేక సేవలు అందిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లోని విప్లవాత్మక మార్పులు ప్రజల ఆర్థిక అవసరాలను తీరుస్తు్న్నాయి. కోట్ల మంది సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ డబ్బుకు పూర్తి గ్యారెంటీ, భద్రతతో కూడిన పెట్టుబడి ఎంపికలను ఆఫర్ చేస్తోంది. 

ఇప్పుడు మనం తెలుసుకోబోతోంది పోస్టాఫీస్ పీపీఎఫ్ స్కీమ్ గురించే. అవును పెట్టుబడికి పూర్తి హామీతో కూడిన గ్యారెంటీ రిటర్న్స్ అందించటం వల్ల చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పీపీఎఫ్ ఒక మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తున్నారు దేశంలో. సేఫ్ రిటర్న్ కోరుకునేవారికి ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్. ప్రతి మూడు నెలలకు కేంద్ర ప్రభుత్వం వీటి వడ్డీ రేట్లను మార్పు చేస్తుండగా.. ప్రస్తుతం 7.1 శాతం రేటున వడ్డీ చెల్లిస్తున్నారు. 

పీపీఎఫ్ ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 పెట్టుబడి నుంచి గరిష్ఠంగా రూ.లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ కింద చేసే పెట్టుబడులకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 15 ఏళ్లకు ఈ స్కీమ్ మెచ్చూర్ అవుతుంది.. ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దానిని పొడిగించుకునేందుకు వీలు ఉంది. 

ALSO READ : GST 2.0 ఎఫెక్ట్.. 5 లక్షల కంటే తక్కువ ధరకే వస్తున్న టాప్ 5 కార్లు ఇవే..

పీపీఎఫ్ ద్వారా రూ.90 లక్షలు కూడబెట్టడం ఎలా..?
మీరు PPF ద్వారా 25 సంవత్సరాల్లో రూ.90 లక్షల నిధిని సృష్టించాలనుకుంటే.. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ.11వేలు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి సంవత్సరానికి రూ. లక్ష32 వేలు అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వ్యవధిని పొడిగించడానికి మీరు పోస్టాఫీసుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పెట్టుబడి 25 సంవత్సరాలలో రూ.90లక్షల71వేల 053 రాబడిని ఇస్తుంది. ఇందులో రూ. 33 లక్షల పెట్టుబడి మొత్తం ఉంటుంది. వడ్డీ ఆదాయం రూ. 57లక్షల 71వేల053 ఉంటుంది.