
పేదరికం ప్రపంచంలోని చాలా సమాజాలను ఆధునిక యుగంలోనూ వెంటాడుతున్న అతిపెద్ద సమస్యగానే కొనసాగుతోంది. అసలు నేటి కాలంలో పేదలు అంటే ఎవరి అందుకు అర్హతలు ఏంటి.. పేదవారిగా పరిగణించటానికి తీసుకునే ప్యారామీటర్స్ ఏంటి అనే అనేక అంశాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ ఇటీవల నిర్వహించిన అనలసిస్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన మార్పులపై పెద్ద చర్చ కొనసాగుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎవరైనా వ్యక్తి తన కనీసం అవసరాలైన ఆరోగ్యం, ఆహారం, మంచినీరు, పరిశుభ్రత, నివాసం వంటివి పొందలేకపోతుంటే వారిని పేదవారిగా పరిగణిస్తారు. అయితే భారతదేశంలో తలసరి నెలవారీ ఖర్చులను దీనికి కొలమానంగా తీసుకోబడుతోంది. దీని ప్రకారం నెలకు పట్టణ ప్రాంతాల్లో రూ.1047, గ్రామీణ ప్రాంతాల్లో కూ.972 ఖర్చును నిర్వహించింది రిజర్వు బ్యాంక్. అంటే రోజుకు పట్టణంలో రూ.47 ఖర్చుపెట్టే స్థోమత ఉన్నవారు, గ్రామాల్లో రోజుకు రూ.32 ఖర్చుచేసేవాళ్లు పేదరికానికి పైన ఉన్నట్లు లెక్క. ఈ లెక్కన ప్రస్తుతం దేశంలో పేదల సంఖ్య 29.5 శాతం మెుత్తం జనాభాలో ఉంది.
ఇక తలసరి వార్షిక ఆదాయం విషయానికి వస్తే సిక్కిం మెుదటి స్థానంలో రూ.5లక్షల 87వేల 743గా ఉంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో రూ.3లక్షల 79వేలుగా ఉండగా ఏపీలో రూ.2లక్షల 19వేల 518గా కొనసాగుతోంది. నీతి అయోగ్ తాజా రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో పేదరికం భారీగా తగ్గి 2022-23 నాటికి 11.28 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేగంగా పేదరికం తగ్గినట్లు గుర్తించబడింది.
ALSO READ : పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి.. ఎలాంటప్పుడు తీసుకోకూడదో తెలుసా..?
1960ల నుంచి 1990ల వరకు పాలసీ మేకర్స్ అలాగే ఆర్థికవేత్తల మధ్య అసలు పేదరికం అంటే ఏంటి దానికి ప్రామాణికాలు ఏంటనే అంశంపై చర్యలు జరిగాయి. ఆ సమయంలో అమృతా సేన్ సహా చాలా మంది ప్రభుత్వం అందిస్తున్న అధికారిక డేటా కేలరీల ఆధారంగా ఉండటం సరికాదని వాదించారు. కానీ ఇప్పుడు కొత్త సర్వేల ప్రకారం మల్టీడైమెన్షనల్ పావర్టీ మెజర్స్, ప్రజల వినియోగం సమాచారాన్ని దీనికి ప్రామాణికాలుగా మారాయి. భారతదేశంలో పేదరికం తగ్గటానికి ప్రధానంగా ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ సరఫరా విధానాలేనని వెల్లడైంది. ప్రస్తుతం ఒక వ్యక్తి పేదవాడు అని గుర్తించటానికి ఆరోగ్యం, విద్య, వైద్యం, జీవన పరిస్థితి, ఇల్లు, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటోంది భారత ప్రభుత్వం.