రీ సైకిల్డ్ ప్లాస్టిక్ తో కట్టిన మొదటి ఇళ్లు ఇదే..

రీ సైకిల్డ్ ప్లాస్టిక్ తో కట్టిన మొదటి ఇళ్లు ఇదే..

కర్ణాటకలో  రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో మొదటి సారి ఓ ఇంటిని నిర్మించారు . మంగళూరు సిటీలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి ప్లాస్టిక్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ తో ఇంటిని కట్టించి ఇచ్చారు.  ప్లాస్టిక్స్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్ చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ షిఫ్రా జాకబ్స్ మాట్లాడుతూ.. లబ్ధిదారులలో ఒకరైన కమల ఇంటి నిర్మాణానికి 1,500 కిలోల రీసైకిల్ ప్లాస్టిక్‌ను ఉపయోగించామని చెప్పారు. రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా ఉత్పత్తి చేయబడిన 60 ప్యానెల్లు ఉపయోగించామన్నారు.  దీనికి 4.50 లక్షల ఖర్చు అయిందని చెప్పారు. ఇదే కాన్సెప్ట్ తో చెత్త సేకరించేవారి కోసం వచ్చే ఏడాది మరో 20 ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.

కళ్లు చెదిరే కాంతులతో గోల్డెన్ టెంపుల్