
కోదాడ, వెలుగు: ఈ నెల 17,18వ తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదరన్ సైన్స్ డ్రామా జిల్లాస్థాయి పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు అఖిల్, బంగారం, జశ్వంత్, రాంప్రసాద్, అఖిలేశ్వర్రెడ్డి, బాలనరసింహస్వామి, ఇమ్రాన్, సల్మాన్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రామకృష్ణ తెలిపారు.
శుక్రవారం ఉపాధ్యాయులతో కలిసి వారిని సత్కరించి, మెమొంటోలు అందజేశారు. యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలపై జరిగిన పోటీల్లో తమ స్టూడెంట్స్జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను ఎంఈవో సలీం షరీఫ్ అభినందించారు.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు..
మునుగోడు, వెలుగు: ఈ నెల 10, 11, 12వ తేదీల్లో నిజామాబాద్ లో నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలకు మహాత్మా జ్యోతిబాపూలే మునుగోడు బాలికల పాఠశాల ఏడోతరగతి విద్యార్థిని కె.తేజశ్రీ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్సంధ్య తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను అభినందించారు. కోచ్ ప్రణీత్సూచనలు పాటించి, తేజశ్రీ పోటీలో ప్రతిభ కనబరించిందని తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని సూచించారు. పాఠశాల పీఈటీ నాగమణి తదితరులున్నారు.