బైరి నరేష్కు 14రోజుల రిమాండ్.. పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత

బైరి నరేష్కు 14రోజుల రిమాండ్.. పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత

అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని పరిగి సబ్ జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో పోలీస్ వాహనాలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు జైలు వద్దకు భారీగా తరలిరావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా అయ్యప్పస్వామిపై నరేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్పస్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నరేష్‌ను కొందరు అయ్యప్ప స్వాములు చితకబాదారు. అయితే నరేష్‌ను అరెస్ట్ చేశామని..  అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కోరారు. అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లలో నరేష్ పై కేసులు నమోదయ్యాయి. తాజాగా వరంగల్లో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.