V6 News

కొడంగల్ కోఆప్షన్ ఏకగ్రీవం

కొడంగల్ కోఆప్షన్ ఏకగ్రీవం

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం ముగిసింది. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో రమేశ్​బాబు, సాంత్రమ్మ (జనరల్ కేటగిరీ), మునీర్, షారీఫా బేగం (మైనారిటీ కేటగిరీ)ను సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

మొత్తం నాలుగు కోఆప్షన్ పదవుల కోసం 12 దరఖాస్తులు వచ్చినప్పటికీ కౌన్సిల్ సభ్యులందరి సమన్వయంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.