కోహ్లీ నన్ను హెడ్ కోచ్గా బాధ్యత తీసుకోమన్నాడు : సెహ్వాగ్

కోహ్లీ నన్ను హెడ్ కోచ్గా బాధ్యత తీసుకోమన్నాడు : సెహ్వాగ్

టీమిండియా హెడ్ కోచ్ గా తనను బాధ్యతలు తీసుకొమ్మన్నారని భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. న్యూస్18 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా.. పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత అప్పటి హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్థానంలో తనను బాధ్యతలు తీసుకొమ్మన్నారని చెప్పాడు. విరాట్ కోహ్లీ, అప్పటి బీసీసీఐ సెక్రెటరీ అమితాబ్ చౌదరీ సెహ్వాగ్ ను కలిసి హెడ్ కోచ్ గా అపాయింట్ కావాలని కోరారట.

2016లో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా అపాంట్ అయినప్పటినుంచి విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేల మధ్య విభేదాలు జరుగుతున్నాయి. మీడియా సమావేశాల్లో చాలాసార్లు హెడ్ కోచ్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఓడిపోయినందుకు అప్పటి బీసీసీఐ కమిటీ కూడా కుంబ్లే కాంట్రాక్టును పొడగించే ఆలోచన చేయలేదు. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత జరిగిన వెస్టిండీస్ పర్యటనకు డైరెక్టుగా సెహ్వాగ్ ను హెడ్ కోచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, దానికి సెహ్వా్గ్ నిరాకరించాడు. తన లైఫ్ లో భారత్ తరుపున ఆడే అవకాశం వచ్చినందుకే చాలా గర్వ పడ్డానని, కెప్టెగా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవం అని సెహ్వాగ్ అన్నాడు. ‘నేను సాధించని వాటితో హ్యాపీగా ఉన్నా. వేరే పదవులపై ఆలోచన లేదు. నాకు జీవితంలో చాలా దక్కాయి’ అంటూ హెడ్ కోచ్ ఆఫర్ ని తిరస్కరించాడు. దాంతో అప్పటి డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని హెడ్ కోచ్ గా నియమించారు.