ఐపీఎల్లో కోహ్లీ అరుదైన రికార్డు

ఐపీఎల్లో కోహ్లీ అరుదైన రికార్డు

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఏప్రిల్ 10వ తేదీన లక్నోతో జరిగిన మ్యాచ్‌లో  కింగ్ కోహ్లీ దుమ్మురేపాడు. కేవలం 44 బంతుల్లో 61 పరుగులు చేసి..బెంగుళూరు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.  ఈ క్రమంలో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 

కోహ్లీ రికార్డు..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్రాంచైజీలపై అర్థ సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఆడుతున్న తొమ్మిది ఫ్రాంచైజీలపై కోహ్లీ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు.. డెక్కన్ చార్జర్స్పై కూడా కోహ్లీ అర్థ సెంచరీ సాధించాడు.  ఇక చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలపై నిషేధం విధించిన సమయంలోఐపీఎల్ ఆడిన  పూణే సూపర్ జెయింట్స్, పూణే వారియర్స్పై కూడా కోహ్లీ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

గుజరాత్పై సెంచరీ..

2016 ఐపీఎల్లో ఆడిన   గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ సెంచరీ (109) సాధించాడు. ఐపీఎల్లో కోహ్లీ నాలుగు ఫ్రాంచైజీలపై సెంచరీలు చేయడం విశేషం.  పంజాబ్ కింగ్స్, గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్పై కోహ్లీ సెంచరీలు నమోదు చేశాడు.  2022లో  కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌పై కూడా కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. లక్నోపై తాజాగా 61 పరుగులు సాధించాడు.  దీంతో ఐపీఎల్ ఆడిన 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా  కోహ్లీ రికార్డు సృష్టించాడు.

రికార్డుల రారాజు..

ఐపీఎల్లో కోహ్లీ ఇప్పటి వరకు అనేక రికార్డులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. అంతేకాదు కెప్టెన్‌గా ఎక్కువ పరుగులు చేసింది కోహ్లీనే.