
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అటు గ్రౌండ్‌లో ఇటు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాలో 25 కోట్ల (250 మిలియన్) ఫాలోవర్లను సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచాడు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
అథ్లెట్లలో ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తి కోహ్లీనే కావడం విశేషం. రొనాల్డో 585 మిలియన్ ఫాలోవర్లతో వరల్డ్ వైడ్ టాప్ ప్లేస్‌లో ఉండగా, మెస్సీ 464 మిలియన్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.