నాని జెర్సీ మూవీ సీన్ రిపీట్ చేసిన కోహ్లీ.. గ్రౌండ్‎లో చిన్న పిల్లాడిలా మారిపోయిన కింగ్

నాని జెర్సీ మూవీ సీన్ రిపీట్ చేసిన కోహ్లీ.. గ్రౌండ్‎లో చిన్న పిల్లాడిలా మారిపోయిన కింగ్

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవడంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. నార్మల్‎గానే గ్రౌండ్‎లో అగ్రెసివ్‎గా ఉండే కోహ్లీ.. 17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో భావోద్వేగానికి గురయ్యాడు. పంజాబ్‎తో జరిగిన ఫైనల్ మ్యాచులో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్న సీన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‎లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా కోహ్లీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫైనల్ మ్యాచ్ అనంతరం గ్రౌండ్లో టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీలోని ఓ సీన్ రిపీట్ అయ్యింది. జెర్సీ సినిమాలో ఓ సీన్‎లో హీరో నాని తన క్రికెట్ కోచ్‎ను అప్యాయంగా హత్తుకుంటాడు. ఐపీఎల్ ఫైనల్‎లో ఆర్సీబీ విజయం అనంతరం విరాట్ కోహ్లీ కూడా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని సేమ్ అదే విధంగా హాగ్ చేసుకున్నాడు. కాకపోతే కోహ్లీ ఇంకా చిన్నపిల్లాడిలా పరిగెత్తూకుంటూ వచ్చి అమాంతం రవిశాస్త్రి ఒళ్ల వాలిపోతాడు. 

ఈ ఇంట్రెస్టింగ్ సీన్‎ను జెర్సీ మూవీలోని నాని సీన్‎తో యాడ్ చేసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో  వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యా్న్స్ కింగ్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య ఉన్న బాండింగ్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో కోహ్లీ భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శాస్త్రి, కోహ్లీ కాంబినేషన్‎లో టీమిండియా కొత్తపుంతలు తొక్కింది.

 వీరిద్దరి కాంబినేషన్లోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‎లో టీమిండియా టెస్టు సిరీస్‎లను గెలిచి చరిత్ర తిరగరాసింది. ఈ సమయంలో కోహ్లీ, రవిశాస్త్రి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ బాండింగ్ ఇప్పటికే అలాగే కొనసాగుతోంది. రవిశాస్త్రి కూడా ఎన్నో సార్లు బహిరంగంగానే విరాట్ కోహ్లీపైన తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా విరాట్ కోహ్లీ చేసిన పనితో వీరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి హెలెట్‎గా నిలిచింది.