పెళ్లి మండపంలో లాప్ టాప్‭లో పనిచేస్తున్న వరుడు

పెళ్లి మండపంలో లాప్ టాప్‭లో పనిచేస్తున్న వరుడు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. వధూవరులు ఒక్కటయ్యే ఈ వేడుక గుర్తు చేసుకున్న ప్రతిసారి మధురానుభూతినిస్తుంది. అయితే కోల్ కతాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఒకవైపు వివాహ తంతు జరుగుతుండగానే మరోవైపు వరుడు ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్న ఫొటో వైరల్ గా మారింది. కోల్‭కతా ఇన్‭స్టాగ్రామర్స్ అనే అకౌంట్ లో ఈ ఫొటోలు షేర్ చేశారు. వాటిని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి రోజున కూడా పరధ్యానంతో వర్క్ చేసుకుంటున్నాడని కొందరు ఫన్నీగా రియాక్ట్ అయితే పెళ్లి రోజు కూడా వర్కేనా అంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్‭ను మళ్లీ గుర్తు చేశాడంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ వరడు వర్క్ ప్రెజర్ కారణంగా పెళ్లి మండపంలో కూడా పనిచేయాల్సి వస్తే మాత్రం అతను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్న ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.