ఐపీఎల్ కిక్కు: బౌలర్లే హీరోలవుతున్నరు..!

ఐపీఎల్ కిక్కు: బౌలర్లే హీరోలవుతున్నరు..!

ఐపీఎల్ 15వ సీజన్ ఇంట్రెస్టింగ్ జరుగుతోంది. సూపర్ డూపర్ ఫర్ఫామెన్స్ తో కొందరు హీరోలవుతుంటే..మరికొంతమంది ఫామ్ కంటిన్యూ చేయలేకపోతున్నారు. గతేడాది హీరోలుగా ఉన్న ఐదుగురు ఈసారి అంతగా ఆడటంలేదు. 2021 CSK హీరో రుతురాజ్  గైక్వాడ్ ఈసారి ఇంకా బ్యాట్ కు పని చెప్పలేదు.  లాస్ట్ సీజన్ లో 16 మ్యాచుల్లో 635 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు రుతురాజ్ .సీఎస్ కే టైటిల్ విన్ అవ్వడంలో కీరోల్ ప్లే చేశాడు. ఈ సీజన్ లో మాత్రం ఇప్పటివరకు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సీఎస్ కే ఆడిన మూడు మ్యాచుల్లో రుతురాజ్  రెండు పరుగులే చేశాడు. లక్నో మ్యాచ్ లో రుతురాజ్  డకౌట్ అయ్యాడు. 

గతేడాది ఐపీఎల్  సంచలనం వెంకటేశ్  అయ్యర్ ఈసారి ఫెయిల్ అవుతున్నాడు. 2021 సీజన్  ఆరంభంలో పెద్దగా ఆడని అయ్యర్ .. తర్వాత కేకేఆర్ కు వెన్నుముఖగా మారాడు. 10 మ్యాచ్ ల్లో 370 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంపికైన వెంకటేశ్ అయ్యర్  వెస్టిండీస్ , శ్రీలంకతో టూరులో బానే రాణించాడు. అయితే ఈ సీజన్ లో ఓపెనర్ గా వచ్చిన వెంకటేశ్  అయ్యర్ .. మూడు మ్యాచుల్లో కేవలం 29 పరుగులు చేశాడు.

ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ జైశ్వాల్  అంతగా ఆడటం లేదు. మూడు మ్యాచ్ ల్లో   25 పరుగులే చేశాడు. గతేడాది రాజస్తాన్  రాయల్స్  జట్టుగా విఫలమైనప్పటికీ యశస్వి జైశ్వాల్  సక్సెస్  అయ్యాడు. జైశ్వాల్  10 మ్యాచ్ ల్లో 148 స్ట్రైక్ రేట్ తో 249 పరుగులు సాధించాడు. మరి ఈ సీజన్ తన మార్క్ చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

డేరింగ్ బ్యాట్స్  మెన్ పృథ్వీ షా కూడా ఈ సీజన్ లో ఫెయిల్ అవుతున్నాడు. 2021 సీజన్ లో 15 మ్యాచ్ ల్లో 479 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఢిల్లీ పవర్ ప్లేలో భారీ స్కోరు చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు, అయితే ఈసారి షా మెరుపులు కనిపించడం లేదు.  ఆడిన రెండు మ్యాచ్ ల్లో 48 పరుగులు చేసిన పృథ్వీ అనవసరంగా వికెట్  పారేసుకుంటున్నాడు.  కొన్నేళ్ళుగా ఐపీఎల్ లో కేకేఆర్ కు కీలకంగా మారాడు నితీష్ రాణా. గత సీజన్ లో 17 మ్యాచుల్లో 383 పరుగులు సాధించాడు. కానీ ఈసారి మాత్రం మూడు మ్యాచ్ ల్లో31 పరుగులు చేశాడు. ఈ యువ బ్యాట్స్ మెన్స్ అంతా ఫామ్ లోకి రావాలని ..మెరుపులు మెరిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.