IPL 2025: నష్టం జరిగాక రూల్ ఎలా మారుస్తారు.. బీసీసీపై KKR సీఈఓ వెంకీ మైసూర్ అసంతృప్తి

IPL 2025: నష్టం జరిగాక రూల్ ఎలా మారుస్తారు.. బీసీసీపై KKR సీఈఓ వెంకీ మైసూర్ అసంతృప్తి

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. ఐపీఎల్ రీ షెడ్యూల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో  కోల్‌కతా గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండేది. కానీ భారీ వర్షం మ్యాచ్ రద్దుకు కారణమైంది. దీంతో బీసీసీఐ రానున్న ఐపీఎల్ మ్యాచ్ లు రద్దు కాకుండా ఉండేందుకు వేదికలు మార్చింది. అంతేకాదు వర్షాలు అంతరాయం కలిగిస్తే మ్యాచ్ జరపడానికి అదనపు సమయాన్ని కేటాయించారు. 

ALSO READ | IPL 2025: బీసీసీఐ కొత్త రూల్.. అర్ధరాత్రి 1:15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు

ఐపీఎల్ 2025 సీజన్ లో బీసీసీఐ మంగళవారం (మే 20) కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది. మ్యాచ్ లు రద్దు కాకుండా ఉండడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. వర్షం వలన లేకపోతే ఇతర కారణాల ద్వారా మ్యాచ్ జరగడానికి ఆలస్యం అయిన సందర్భంలో అదనంగా 120 నిమిషాలు పొడిగించారు. మంగళవారం (మే 20) నుండి ఐపీఎల్ లోని మిగిలిన లీగ్ మ్యాచ్ లకు ఈ రూల్ ను చేర్చనున్నారు. ఈ రూల్ పై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన ఆవేదను వ్యక్తం చేస్తూ బీసీసీఐకి ఈ-మెయిల్ ద్వారా ఒక లెటర్ పంపాడు.

ALSO READ | MI vs DC: ప్లే ఆఫ్స్ ముందు మరో ట్విస్ట్.. ముంబై, ఢిల్లీ మ్యాచ్‌కు వర్షం ముప్పు

వెంకీ మైసూర్ రాసిన ఈ-మెయిల్ లో ఈ విధంగా ఉంది. " ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు మే 17న జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ  మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అంతరాయం ఉందని ముందే స్పష్టమైంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ముందే రూల్ పెట్టి ఉంటే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కైనా అవకాశం ఉండేది. మ్యాచ్ వాష్ అవుట్ తో కేకేఆర్ ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలాంటి అసమానత నిర్ణయాలు టోర్నమెంట్ కు తగినవి కావు. మేము ఎందుకు బాధపడుతున్నామో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

గతంలో లీగ్ మ్యాచ్ లకు 60 నిమిషాల ఎక్స్ ట్రా టైం ఉండేది. కానీ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు ముందు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లు రద్దు కాకుండదనే ఉద్దేశ్యంతో మరో గంట పొడిగించడం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ పూర్తి అయ్యేసరికి 11:30 అవుతుంది. గతంలో వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగితే కట్ ఆఫ్ టైం 12:30 నిమిషాల వరకు చూసేవారు. అప్పటికీ మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా 12:30 వరకు జరిగింది.

ALSO READ | WTC 2025 Final: ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. సౌతాఫ్రికా కొత్త జెర్సీ ఆవిష్కరణ

గతంలో ప్లే ఆఫ్స్ కు రెండు గంటల అదనపు సమయం ఉండే రూల్ యధావిధిగా కొనసాగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సీజన్ లోని మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లు రాత్రి 1:30 నిమిషాలలోపు జరిగేందుకు అవకాశం లేకపోతే రద్దు చేయనున్నారు. మే 25న మధ్యాహ్నం జరిగే గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తప్ప మిగిలిన ఎనిమిది లీగ్ మ్యాచ్‌లు సాయంత్రం 8 గంటలకు జరగనున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దు చేయబడ్డాయి. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓవర్లను కుదించారు.