
ఇటవల నాని ‘హిట్ 3’లో వర్ష అనే పాత్రతో ఆకట్టుకున్న కోమలి ప్రసాద్.. త్వరలో ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవల ఆమె డాక్టర్ కోట్ ధరించి ఓ డెంటల్ హాస్పిటల్‌లో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. తను యాక్టింగ్ కెరీర్‌ను వదిలి డాక్టర్ వృత్తిలోకి వెళ్లబోతోందనే ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, తన కెరీర్ గురించి క్లారిటీ ఇచ్చింది కోమలి. ‘నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారం జరుగుతోంది.
కొన్ని మీడియా సంస్థలు ఆ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, కెరీర్‌ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ విధి నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని భావిస్తుంటాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్‌ల ఎంపికలో ఉన్నాను. త్వరలోనే న్యూ మూవీ అనౌన్స్‌మెంట్‌తో వస్తాను’ అని చెప్పింది.