కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డాగా మార్చిన్రు : కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడ్డాగా మార్చిన్రు : కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లీడర్లు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  అవినీతికి కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చారని కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం సిటీలోని ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2014 నుంచి భూ, ఇసుక, గ్రానైట్, గుట్కా మాఫియా నడిపింది బీఆర్ఎస్ నేతలేనని, వారంతా ఇప్పుడు జైలు బాటపడుతున్నారన్నారు.

మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మొదలుకొని జంగిలి సాగర్ వరకు అందరినీ తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని డిమాండ్​ చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్  ప్రమేయం లేకుంటే ఆయన అనుచరులు జైలుకు ఎందుకు వెళుతున్నారని  ప్రశ్నించారు. జమ్మికుంటలో ముగ్గురిపై దాడి చేసిన ఘటనలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షోకాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీస్​ ఇచ్చామన్నారు.

ఎంపీ బండి సంజయ్ మాయమాటలతో సర్పంచులను  మోసం చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్​ జిల్లా కార్యదర్శి రాముడి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ ఎండీ అమీర్, చొప్పదండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రాజేశం పాల్గొన్నారు.