రాష్ట్రంలో మరో 20 ఏండ్లు అధికారం మాదే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో మరో  20 ఏండ్లు అధికారం మాదే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో మరో 20 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రజా పాలన ఉందన్నారు.  ఏ ఊరుకెళ్లినా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అప్పులకు మిత్తికట్టుకుంటూ సంక్షేమాన్ని  ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.  అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. 

దేశంఈ స్థితిలో ఉండటానికి  కారణం సోనియగాంధీనే అన్నారు కోమటిరెడ్డి . కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో  పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ  పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు.

మూడు నెలల్లోనే పారదర్శక పాలన: జూపల్లి

కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ధ్వజమెత్తారు మంత్రి జూపల్లి కృష్ణారావు.  ఓట్లడిగే హక్కు బీఆర్ఎస్ నాయకులు కోల్పోయారన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదన్నారు.  కేసీఆర్ పాలనలో అవినీతి ఆకాశానికి, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి పడిపోయాయని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, చదువులు గాలికిపోయాయని విమర్శించారు.  కృష్ణాజలాలపై రాష్ట్రానికి హక్కులు ఇవ్వకుండా కేంద్రం తగవులు పెడుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు.