వివాదస్పదమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ తీరు

వివాదస్పదమైన కొమురవెల్లి  మల్లన్న ఆలయ చైర్మన్ తీరు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయ చైర్మన్ గీస భిక్షపతి తీరు వివాదస్పదమైంది. శనివారం ఆలయంలోని తన చైర్మన్ కూర్చీలో తన కుమారుడిని కూర్చోబెట్టి ఆ కుర్చీ ప్రక్కనే తాను కూర్చొని ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను తన ఫోన్ స్టేటస్​ గా పెట్టుకున్నాడు. ఈ విషయం వివాదస్పదమై విమర్శలకు దారి తీసింది. రాజరిక పాలనలో తండ్రి తర్వాత తనయుడు తరువాత మనువడు పాలన కొససాగించే విధానంగా ఉందని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఆలయ పదవిలో కొనసాగుతూ చైర్మన్ కుర్చీని అవహేళన చేసేవిధంగా వ్యవహరించడం సిగ్గు చేటని, భిక్షపతి వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళను చేస్తామని హెచ్చరించారు.