
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీల్డ్ కమ్ బహిరంగ వేలంతో రూ.13 లక్షల ఆదాయం వచ్చింది. సోమవారం కొమురవెల్లి దేవస్థానం ఆఫీస్‌లో ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో సీల్డ్ కమ్ వేలం నిర్వహించగా మల్లన్న గుట్టపైన శ్రీఎల్లమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ షాపు లైసెన్స్ హక్కును రూ.13 లక్షలకు అయినాపూర్ గ్రామానికి చెందిన మల్లం శ్రీనివాస్ పాడారు.
ఈ వేలం 11 నెలల వరకు ఉంటుంది. కార్యక్రమంలో ధర్మకర్త జయప్రకాశ్ రెడ్డి, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, ప్రధాన అర్చకుడు మల్లికార్జున్, సురేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.