కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ. 60,82,771 వచ్చింది. గురువారం మల్లికార్జునస్వామి ఆలయ ముఖమండపంలో ఈవో డి.కృష్ణ ప్రసాద్, సిద్దిపేట శ్రీ శరభేశ్వర ఆలయ ఈవో కె.రవికుమార్ ఆధ్వర్యంలో ఆలయంలోని హుండీలను లెక్కించారు.
ఈ సందర్భంగా 13 రోజుల హుండీ ఆదాయం నగదు రూ.60 లక్షల 82 వేల 771, మిశ్రమ బంగారం 36 గ్రాములు, మిశ్రమ వెండి 2.9కేజీలు, విదేశీ కరెన్సీ 127 నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
