
డబ్బులను, ప్రలోభాలను పక్కన పెట్టి హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈటలకు మద్ధతుగా హుజురాబాద్ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారాయన. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలను కేసీఆర్ వమ్ముచేశారని విమర్శించారు. తాను ప్రాతినిధ్యం వహించిన చేవేళ్ల ప్రాంతానికి.. సాగునీటిని ఇచ్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో, పాలనలో అండగా నిలిచిన వారిని కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. కేటీఆర్ కుట్రలను తిప్పికొట్టి ఈటలను గెలిపించాలని కోరుతూ హుజురాబాద్ లో కరపత్రాల పంపిణీ చేపట్టారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
see more news