‘మా ’ఎన్నికలు: మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ నరసింహరావు

‘మా ’ఎన్నికలు:  మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ నరసింహరావు

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీపడుతున్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వేడెక్కిస్తున్నాయి. మా ఎన్నికల్లో పోటీచేస్తానన్న బండ్ల గణేశ్ ప్రకాశ్ రాజ్ కు మద్ధతిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక మా ఎన్నికల బరిలో దిగుతున్న మరో  సీనియర్ నటుడు, సీవీఎల్ నరసింహరావు తన మ్యానిఫేస్టోను ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు వస్తానన్నారు.

మేనిఫేస్టోలోని ముఖ్యాంశాలు

  • 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం .ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయి..ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50మంది సభ్యుల తో కమిటీ ఏర్పాటు . వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తాను .
  • ప్రతి మా సభ్యుడికి 3 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్. అది వచ్చే జనవరి నుంచి అమలు.
  • ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ .
  • పెన్షన్ ప్రస్తుతం రూ.6వేలు ఇస్తున్నారు. ఈ నవంబర్ నుంచి అది రూ.10వేలు ఇచ్చేలా చెయ్యడం.
  • ఆడవాళ్ళకు ఉపయోగ పడే ఆసరానీ 20 ఏళ్లు క్రితం పెట్టాము. మళ్ళీ రివైవ్ చేయడం. ఆసరా కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను.
  • ఎవరైనా మా సభ్యుడు  ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా 2 గంటలలో అతని ఇంటికి నెల రోజులకు సరిపడా గ్రాసరినీ పంపిస్తాం. 

 

For More News..

గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది

మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త