మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త

మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త
  • కాంగ్రెస్‌‌కు ఎమ్మెల్యే గండ్ర సవాల్

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌లో కాంగ్రెస్​కు గత ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఉప ఎన్నికలో అంతకంటే ఒక్క ఓటు ఆ పార్టీకి ఎక్కువొచ్చినా తాను ఎమ్మెల్యే పదవికి, తన భార్య జెడ్పీ చైర్ పర్సన్‌‌ పదవికి రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్‌‌ చేశారు. శుక్రవారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి సభలో పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఒక్క గజం భూమి కబ్జా చేసినట్టు చూపించినా రాజీనామాకు రెడీ అని అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్..  సోనియాగాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించి దొరికిన రేవంత్‌‌ గజదొంగ అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తులేకపోయినా, చంద్రబాబు రాకపోయినా కాంగ్రెస్‌‌కు 40 సీట్లు వచ్చేవని, అవి రాకుండా చేసింది రేవంతేనని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ 2023లో గెలిచే మొదటి సీటు భూపాలపల్లి అయితే.. అభ్యర్థి ఎవరో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రేవంత్‌‌కు దమ్ముంటే తన సవాళ్లను స్వీకరించాలన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మనోళ్లు ఒళ్లొంచి కష్టపడరు: మంత్రి కేటీఆర్

నా కొడుకు బతికుండగానే కోడలికి వితంతు పెన్షన్ ఎట్లిస్తరు?

హుజురాబాద్ బై ఎలక్షన్: టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే