కొండగట్టు అంజన్న ఆదాయం రెండింతలు

కొండగట్టు అంజన్న ఆదాయం రెండింతలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించగా, నిర్వాహకులు పోటీపడ్డారు. ప్రధానంగా కొబ్బరికాయల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది. గతేడాది వేలంపాట ద్వారా రూ.2.64కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.3.75 కోట్లు వచ్చాయి. గతేడాది కొబ్బరి చిప్పల సేకరణ టెండర్ ను రూ.45లక్షలకు దక్కించుకోగా, ఈసారి రూ.80 లక్షలకు దక్కించుకున్నారు.

కిందటేడు రూ.94 లక్షలుగా ఉన్న కొబ్బరికాయల షాపు టెండర్​ఈసారి రూ.1.37కోట్లకు చేరింది. వీటితోపాటు కిరాణా, పూలు, పండ్లు, కూల్​డ్రింక్స్, హోటళ్లను గతంలో కంటే రెండింతలు పెట్టి దక్కించుకున్నారు. వేలం పాటలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్​శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.