మే 10 నుంచి కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యేమేడిపల్లి సత్యం

మే 10 నుంచి కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యేమేడిపల్లి సత్యం

కొండగట్టు, వెలుగు: ఈ నెల 10 నుంచి 12 వరకు జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్  పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. శుక్రవారం పెద్ద జయంతి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద జయంతికి 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని, వారందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌలతులు కల్పిస్తామని తెలిపారు. త్వరలో స్వామివారి చందనోత్సవం కార్యక్రమం చేపడతామని చెప్పారు. సర్పంచ్ ఆదిరెడ్డి, నాయకులు శ్రీనివాస్  గౌడ్, ముత్యం శంకర్, రాజ నరసింగరావు, అర్చకులు కపీందర్, చిరంజీవి పాల్గొన్నారు.