కొండగట్టు హుండీ లెక్కింపులో చోరీ..

కొండగట్టు హుండీ లెక్కింపులో చోరీ..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ద  పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు సమయంలో చోరీ జరిగింది.  ఆలయ ఫౌండర్‌ ట్రష్టీ ఛైర్మన్‌ తిరుక్కోవేళూరు మారుతి  చోరీకి పాల్పడ్డారంటూ కొండగట్టు ఆలయ ధర్మకర్త...ఆలయ  ఈఓకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 

ఆగస్టు  9వ తేదీన కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో  హుండీ లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా భక్తులు హుండీలో వేసిన నగదు, నగలను వేరు చేస్తున్న క్రమంలో విలువైన వస్తువులు చైర్మన్ తిరుక్కోవేళూరు మారుతి..దొంగిలించారని  ఈఓ వెంకటేష్ కు ధర్మకర్త జున్ను సరేందర్, ముత్యంపేట సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డిలు ఫిర్యాదులో చేశారు. 

ఆలయ ఫౌండర్‌ ట్రష్టీ ఛైర్మన్‌ తిరుక్కోవేళూరు మారుతి చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజీలో స్పష్టంగా ఉందని..బంగారు ఆభరణం తీసుకెళ్తున్నట్లు సీసీ పుటేజీలో  ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  అందుకు సంబంధించిన సీసీ పుటేజీని సైతం  అందజేశారు.