
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నకు భారీ ఆదాయం సమకూరింది. మొత్తం 39 రోజులకు సంబంధించిన 12 హుండీలను సోమవారం లెక్కించగా రూ. 1,07,67,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని లాకర్‌లో భద్రపరిచామని, హుండీల్లో 134 విదేశీ కరెన్సీ సైతం వచ్చిందని చెప్పారు. లెక్కింపులో ఈవో శ్రీకాంత్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, హరిహరనాథ్ పాల్గొన్నారు.