కొండపోచమ్మ ఆలయ వేలంపాట ఆదాయం 49.44లక్షలు

 కొండపోచమ్మ ఆలయ వేలంపాట ఆదాయం 49.44లక్షలు

జగదేవపూర్, వెలుగు: కొండపోచమ్మ ఆలయానికి వేలం పాట ద్వారా రూ. 49.44 లక్షల ఆదాయం వచ్చింది. శుక్రవారం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ శివరాజ్ , ఈవో మోహన్ రెడ్డి,  సర్పంచ్ రజిత రమేశ్ కొబ్బరి కాయలు, అమ్మవారి ఒడిబియ్యం, కొబ్బరి ముక్కల సేకరణ, దుకాణా సముదాయాలకు బహిరంగ వేలం నిర్వహించారు.   

ఇందులో కొబ్బరి కాయలు అమ్మేందుకు తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన గాడిశెర్ల శ్రీవాణి రూ.12.14 లక్షలు,  అమ్మవారి ఓడిబియ్యంను అదే గ్రామానికి చెందిన ఉప్పరిపల్లి లక్ష్మి రూ.8.90 లక్షలు,  లడ్డూ, పులిహోరా అమ్మేందుకు గాడిశెర్ల నాగరాజు రూ. 25.40 లక్షలకు, ఐదు షెట్టర్లను అదే  గ్రామానికి చెందింన ఐదుగురు యువకులు రూ.3 లక్షలకు దక్కించుకున్నారు.  కొబ్బరి ముక్కల సేకరణకి సరైన వేలం పాట రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. 

ఈ వేలం పాట 23 డిసెంబర్2023 నుంచి 23 డిసెంబర్ 2024  కాలానికి నిర్వహించామని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, హరిబాబు, గ్రామస్తులు యాదగిరి, లక్ష్మి నరసింహ రెడ్డి, కనకరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.