రివ్యూ: కొండపొలం

రివ్యూ: కొండపొలం

రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు
నటీనటులు: వైష్ణవ్ తేజ్,రకుల్ ప్రీత్,సాయి చంద్, కోట శ్రీనివాసరావు,రవి ప్రకాష్,హేమ,రచ్చరవి తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్: ఎం.ఎం కీరవాణి
కథ,మాటలు: సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి,జాగర్లమూడి సాయిబాబు
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: క్రిష్
రిలీజ్ డేట్: అక్టోబర్ 8,2021


విశ్లేషణ:
‘‘కొండపొలం’’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నవల చదివిన చాలా మంది ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అయితే ఆ నవల అంత గొప్పగా ఈ సినిమా లేదు. కొన్ని సినిమాలు పుస్తకాల్లోనే బాగుంటాయి. తెరమీదకు తెస్తే నచ్చవు. ‘‘కొండ పొలం’’ కూడా ఇలాంటి సినిమానే. దీన్ని తెరమీదకు తెచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రయత్నం మంచిదే కానీ.. స్లో నరేషన్ వాళ్ల ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది ఈ సినిమా. కొన్ని సీన్లు బాగున్నాయి. హీరో జాబ్ ఇంటర్వూలను సరిగా ఫేస్ చేయటం లేదు,ఆత్మ విశ్వాసం లేదు.తను అడవికి వెళ్లి ఏం నేర్చుకున్నాడు, తర్వాత ఎలా జాబ్ కొట్టాడు అనేది కథ. కరెక్ట్ గా చెప్పాలంటే వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించావాలి అనేది మెయిన్ ప్లాట్. కానీ రెండు గంటల అడవిలో గొర్లను కాపాడటం,వాటి బాధ,వీటి గురించి ఎక్కువ చర్చించారు. ఇక్కడే ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యారు. మధ్యలో లవ్ ట్రాక్ పంటి కింద రాయిలా డిస్టబ్ చేస్తుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా,సెకండాఫ్ బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఈ మూవీ అందరికీ నచ్చదు.
కథేంటి? 
గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టిన రవి (వైష్ణవ్ తేజ్) ఇంజనీరింగ్ వరకూ చదివి జాబ్ కోసం ప్రయత్నిస్తూ..అన్ని ఇంటర్వూలల్లో ఫెయిలవుతూ ఉంటాడు. ఆత్మ విశ్వాసం లేక,భయంతో విఫలమవుతుంటాడు. ఈ క్రమంలో తన వాళ్ళతో కలిసి కొండపొలానికి గొర్రెలు కాయడానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ అడవిలో రవికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి ? వాటిని అతను ఎలా ఎదిరించి గెలిచాడు ? చివరకు జాబ్ సంపాదించాడు అన్నది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ మరో సారి తన ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన యువకుడిగా మెప్పించాడు. రకుల్ ప్రీత్ ఫర్వాలేదనిపించింది. కానీ పేద అమ్మాయి పాత్రకు సూట్ అవ్వలేదు. సాయిచంద్ కు దక్కిన మంచి పాత్రలో ఆయన రాణించాడు. రవి ప్రకాష్ బాగా చేశాడు. హేమ ,రచ్చరవి,మహేష్ తదితరులు కూడా బాగా చేశారు.
టెక్నికల్ వర్క్:
సినిమాకు ప్రధాన బలాలు సినిమాటోగ్రఫీ,మ్యూజిక్. జ్ణాన శేఖర్ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. కీరవాణి పాటల్లో రెండు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లను ఎలివేట్ చేశాడు.ఎడిటింగ్ లో లోపాలున్నాయి.కొంతవరకు కట్ చేయాల్సింది. సెకండాఫ్ లో ల్యాగ్ ఎక్కువైంది. ఆర్ట్ వర్క్ బాగుంది. డైలాగులు బాగున్నాయి.