తిరుమల స్వామి వారికి కొప్పెర వంశస్తులు హుండీ విరాళం..

తిరుమల స్వామి వారికి కొప్పెర వంశస్తులు  హుండీ విరాళం..

తిరుమల శ్రీవారికి భక్తులు అనేక విధాలుగా భక్తులు సమర్పించుకుంటారు.  ధనము.. బంగారం.. వెండి.. ఇంకా అనేకంగా ముడుపులు కట్టి సమర్పిస్తుంటారు.  కాని తిరుపతి సమీపంలోని కొప్పెర‌వాండ్లప‌ల్లెకు ఓ కుటుంబం హుండీని బహుకరించింది.  ఇలా స్వామికి సమర్పించడం వంశపారపర్యంగా వస్తుందని కొప్పెర వంశస్తులు తెలిపారు.

తిరుమల శ్రీవారికి శుక్రవారం ( అక్టోబర్​ 17)  కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుప‌తి స‌మీపంలోని కొప్పెర‌వాండ్లప‌ల్లెకు చెందిన  కొప్పెర సాయిసురేష్‌ ఈ   హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందించారు.

రాగి, ఇత్తడితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 70 కిలోలు ఉంటుంది.  దీని విలువ రూ.2.50 ల‌క్షలని దాత‌ తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశ‌పారంప‌ర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు స‌మ‌ర్పిస్తున్నామ‌ని వెల్లడించారు.దీని తయారీకి దాదాపు 20 రోజులు పడుతుందని చెబుతున్నారు.