ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి : విద్యాసాగర్ రావు

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి :  విద్యాసాగర్ రావు

తాను  కోరుట్ల నియోజకవర్గంలో చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు.  రేవంత్ రెడ్డి తనపై, తన కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేశాడని,  మరోసారి అలాంటి కూతలు కూస్తే సహించేది లేదన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని విద్యాసాగర్ రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్  దుర్మార్గమైన మాటలు మాట్లాడటం సిగ్గు చేటున్నారు. వెంటనే కవితకు సంజయ్ క్షమాపణలు  చెప్పాలని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. మరోసారి పిచ్చికూతలు కూస్తే తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. 

 మహిళలందరికీ అండగా ఉంటానన్న గవర్నర్ .. ఇప్పుడు బండి సంజయ్తో కవితకు క్షమాపణలు  చెప్పించాలని కోరుట్ల  జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు.   గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడనే కారణంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్ ముందు క్షమాపణలు  చెప్పాడని గుర్తుచేశారు. అలాగే బండి సంజయ్ కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. గవర్నర్కు బీజేపీలో ఉన్న మహిళలే మహిళలా మిగతావారు కాదా అని ఆమె ప్రశ్ని్ంచారు.