పాల్వంచ: డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇళ్లకు లక్కీ డ్రా

పాల్వంచ: డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇళ్లకు లక్కీ డ్రా

పాల్వంచ, వెలుగు: అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు అందేలా కృషి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం పాల్వంచలోని పెద్దమ్మతల్లి ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌లో నిర్వహించిన లబ్ధిదారుల లక్కీ డ్రా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 360 డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లకు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పాల్వంచలోని 27 డివిజన్ల నుంచి 4,611 దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి విచారణ అనంతరం 1,254 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

అందుబాటులో ఉన్న ఇండ్ల కంటే అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామని, సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పారు. కలెక్టర్‌‌‌‌ అంకిత్‌‌‌‌ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

బీజేపీ ఆందోళన..

డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. లక్కీ డ్రా కేంద్రంలో ఆఫీసర్లను నిలదీయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను పాల్వంచ టౌన్‌‌‌‌ పీఎస్​కు తరలించారు.