రికార్డింగ్ డ్యాన్సర్‌‌‌‌ లైఫ్‌‌ స్టోరీతో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’.. ట్రైలర్ రిలీజ్

రికార్డింగ్ డ్యాన్సర్‌‌‌‌ లైఫ్‌‌ స్టోరీతో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’.. ట్రైలర్ రిలీజ్

కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.  హీరో రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తోంది. గురువారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. లోకల్ రికార్డ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ అయిన రామకృష్ణ.. తను ప్రేమించిన సావిత్రిని కలవడానికి వెళ్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు అతని జీవితాన్ని గందరగోళంలో పడేస్తాయి. ఊహించని మలుపు తిరిగిన ఆ మిస్టీరియస్‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఏమిటనే ట్విస్ట్‌‌‌‌‌‌‌‌తో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్ చేశారు.

‘దేవుడంటే నిజమో అబద్ధమో కాదు.. నమ్మకం’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో పాటు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో టూ వీలర్‌‌‌‌‌‌‌‌కు సూపర్ పవర్స్‌‌‌‌‌‌‌‌ రావడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  మనోజ్ చంద్ర, మోనిక టి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించగా.. ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ ముఖ్యపాత్రలు పోషించారు. విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.