
కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో నిర్మాతగా సక్సెస్ సాధించిన ప్రవీణ పరుచూరి.. దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే నోస్టాలజిక్ మూవీని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి సమర్పణలో గోపాలకృష్ణ పరుచూరితో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 18న సినిమా విడుదల కానుంది. శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒకప్పటి పల్లెటూరి నేపథ్యంలో సున్నితమైన హాస్యంతో కూడిన లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు.
మనోజ్ చంద్ర రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతను డ్యాన్స్ పార్టనర్ కోసం వెతుకుతున్నప్పుడు ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు. కంప్లీట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మణిశర్మ సంగీతం అందించగా, వరుణ్ ఉన్ని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫన్‌ని ఎలివేట్ చేసింది. ఈ చిత్రంలో మోనికా టి, ఉషా బోనెల ముఖ్య పాత్రల్లో నటించారు.