కోవై సరళ షాకింగ్ లుక్

కోవై సరళ షాకింగ్ లుక్

తనదైన కామెడీతో నవ్వులు పూయించే నటి కోవై సరళను చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. గుర్తు పట్టలేనంతగా తయారు కావడంతో మొదట ఎవరని ఆలోచించారు. పోస్టర్ లో పేర్లను చూసి ఆమె.. కోవై సరళ అని గుర్తు పట్టారు. తలపై ఓ దుప్పటి కప్పుకుని.. బాలికను పట్టుకుని వృద్ధురాలిగా దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆమె తమిళ చిత్రం ‘సెంబి’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె సీరియస్ పాత్రను పోషిస్తున్నట్లుగా సమాచారం. ‘అరణ్య’ ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఫస్ట్ లుక్ ను శుక్రవారం రిలీజ్ చేశారు.

24 మంది బస్సు ప్రయాణీకుల చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కోవై సరళ సీరియస్ పాత్ర పోషిస్తున్నారని టాక్. తంబి రామయ్య, అశ్విన్ కుమార్ తో పాటు ఛైల్డ్ ఆర్టిస్టు నీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. ఇక కోవై సరళ విషయానికి వస్తే.. కామెడీ పాత్రలను పోషించడంలో ఆమెకు ఆమె సాటి. తనదైన శైలిలో డైలాగ్స్ పలుకుతూ.. ప్రేక్షకులను నవ్విస్తుంటారు. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. లేడీ కమడియన్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళ నటి అయినా.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2019లో వచ్చిన ‘అభినేత్రి 2’ (Actress 2 Movie) సినిమాలో నటించిన ఆమె.. మరలా ఇతర సినిమాలు ఒప్పుకోలేదు. తాజాగా.. ‘సెంబి’ సినిమాలో నటిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం : -

కడుపుబ్బ నవ్వుకునే సినిమా ఎఫ్ 3


తండ్రైన నటుడు సుధాకర్ కోమాకుల.. ఏ పేరు పెట్టారో తెలుసా