వీడియో: చరిత్ర సృష్టించిన అఫ్ఘాన్ క్రికెటర్.. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు

వీడియో: చరిత్ర సృష్టించిన అఫ్ఘాన్ క్రికెటర్.. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు

అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ సెడిఖుల్లా అటల్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకి అఫ్ఘాన్ వేదికగా జరుగుతోన్న కాబుల్ ప్రీమియర్ లీగ్ 2023(కేపీఎల్) వేదికైంది. 

కాబుల్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా అబాసిన్ డిఫెండర్స్‌తో జరిగిన మ్యాచులో షాహీన్ హంటర్స్ కెప్టెన్ సెడిఖుల్లా వీరవిహారం చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. సెడిఖుల్లా ధాటికి హంటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

ఒకే ఓవర్‌లో 7 సిక్సులు

హంటర్స్ ఇన్నింగ్స్ అమీర్ జజాయ్ వేసిన 19వ ఓవర్‌లో సెడిఖుల్లా ఏకంగా 7 సిక్సులు బాదాడు. తొలి బంతి నోబ్+ సిక్స్ కాగా, తరువాతి 6 బంతులను 6 సిక్సులుగా మలిచాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 48 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదిన తొలి అఫ్ఘాన్ కక్రికెటర్‌గా సెడిఖుల్లా చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచులో హంటర్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హంటర్స్ 213 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో అబాసిన్ డిఫెండర్స్ 121 పరుగులకే కుప్పకూలింది.

ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదిన రుతురాజ్ గైక్వాడ్

భారత క్రికెటర్లలో యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచులో రుతురాజ్ ఈ రికార్డు సృష్టించాడు. మహారాష్ట్ర బౌలర్ రుతురాజ్ శివసింగ్ వేసిన ఒక ఓవర్ లో 7 సిక్సులు బాదాడు. ఆరు బంతులను స్టాండ్స్ వెలుపలకు కొట్టిన గైక్వాడ్.. ఆ ఓవర్ లో పడిన నోబాల్ ను స్టాండ్స్ లోకి తరలించాడు. దీంతో 7 బంతులకు 7 సిక్సులు వచ్చాయి.