
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్ దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. పెట్లా కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత నిర్మిస్తున్నారు. బుధవారం ట్రైలర్‌ను నిర్మాత దిల్ రాజు విడుదల చేసి.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌ను అభినందించారు.
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ ఇదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. ఆగస్టు 4న సినిమా విడుదల కానుంది.