కృష్ణా ట్రిబ్యునల్ గడువు పొడిగింపు

కృష్ణా ట్రిబ్యునల్ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు:  కృష్ణా నది జల వివాదాల ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. ట్రిబ్యునల్ గడువును 2024 మార్చి 31 వరకు పొడగించినట్లు కేంద్ర జల వనరుల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాద పరిష్కారంపై ఈ ఏడాది ఆగష్టు 1లోపు ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సి ఉంది.

కృష్ణా జలాల వివాదంపై రెండు రాష్ట్రాలు తమ వాదనలు కొనసాగిస్తున్నాయి. ఈ వాదనలు ముగిశాక, వాటిని పరిగణనలోకి తీసుకొని ట్రిబ్యునల్ అవార్డ్స్ రిలీజ్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ట్రిబ్యునల్ గడువును కేంద్రం వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించినట్లు తెలిసింది.