కృష్ణ, విజయ నిర్మల జంటగా 47 చిత్రాలు

కృష్ణ, విజయ నిర్మల జంటగా 47 చిత్రాలు

సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే 1962లో ఇందిరా దేవితో పెళ్లి జరిగింది. తరువాత కృష్ణ సినీ ప్రస్థానంలో విజయ నిర్మలతో ప్రేమలో పడ్డారు. కృష్ణ నటించిన ‘సాక్షి’ సినిమాతో నటులుగా వెండి తెరకు పరిచయం అయిన వీళ్లు, తర్వాత ప్రేమించుకుని పెళ్లి బంధంతో 1969లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కూడా వీళ్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఏకంగా 47 సినిమాలు విడుదలయ్యాయి. విజయ నిర్మల డైరెక్టర్ గా సక్సెస్ అవ్వడంలో కృష్ణ పాత్ర చాలా ఉంది. 

కాంబినేషన్లో వచ్చిన మూవీస్..

కృష్ణ, విజయ నిర్మల జోడీగా... సాక్షి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ ప్రెస్, అత్తగారు కొత్తకోడలు, లవ్ ఇన్ ఆంధ్రా, టక్కరి దొంగ చక్కని చుక్క, విచిత్ర కుటుంబం, బందిపోటు భీమన్న, అక్కా చెల్లెలు, మా నాన్న నిర్దోషి, మళ్లీపెళ్లి, విధి విలాసం, అమ్మకోసం, తాళిబొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లికూతురు, పగ సాధిస్తా, అగ్నిపరీక్ష, రెండు కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి,అనురాధ, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, ప్రజా నాయకుడు, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా, గాలిపటాలు, అల్లూరి సీతారామరాజు, ధనవంతుడు గుణవంతుడు, దేవదాసు, సంతానం – సౌభాగ్యం, పాడిపంటలు, రామరాజ్యంలో రక్త పాతం, దేవుడే గెలిచాడు, పంచాయితీ, పట్నవాసం, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్తసంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర, శ్రావణమాసం చిత్రాల్లో కలిసి నటించారు.

కృష్ణ, విజయ నిర్మల  కలిసి నటించిన చిత్రాల్లో సూపర్ హిట్ అయినవి చాలా ఉన్నాయి. విజయ డైరెక్టర్ అయ్యాక మీనా నవల ఆధారంగా కృష్ణ హీరోగా ఒక సినిమా కూడా తీసింది. అది కూడా హిట్ కొట్టింది.